Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాలిఫోర్నియా
అమెరికాలో గురుద్వారాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. అయితే జాతి విద్వేష ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు.