Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత సమస్యతో గత పాతిక రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడటంతో ఇవ్వాళ మరణించాడు. ఇన్నోసెంట్ కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
నృతశాల సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నోసెంట్ ఇప్పటివరకు దాదాపు 750సినిమాల్లో నటించాడు. ‘మజావిల్ కావడి జాతకం’, ‘పథం నిలయిలే తీవండి’, ‘రావణప్రభు’, ‘వేషం’, ‘స్నేహవీడు’, ‘మనసిన్నక్కరే’తో పాటు పలు మలయాళ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు అలరించాడు. గతేడాది పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువా’ సినిమాలో కనిపించాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘పచ్చవుమ్ అద్భుతవిలక్కుమ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.