Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్‌ను సుదీర్ఘంగా విచారించి వారి నుంచి కీలకమైన విషయాలను రాబట్టనున్నారు. సీసీఎస్ నుంచి సిట్ కార్యాలయానికి నిందితులను తరలించి విచారించనున్నారు. అయితే ఆదివారం సిట్ విచారణలో డాక్యా నాయక్, రాజేశ్వర్‌ను హైదరాబాద్‌లో బస చేసిన హోటల్‌కి తీసుకువెళ్లి అధికారులు వివరాలు సేకరించారు. అలాగే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులనూ సిట్ పోలీసులు నిన్న విచారించారు. వివిధ జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకులను హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో రెండో రోజు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని అదుపులో తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.