Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. మూడు నెలల పాటు విచారణను వాయిదా వేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకురానున్న తరుణంలో సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది. ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంయుక్త సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే తుది నివేదిక అందించడానికి మూడు నెలల సమయం కావాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం లేఖ సమర్పించింది.