Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం తెలిపింది. విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదే అని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.