Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి. లోక్సభ సాయంత్రం 4 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత విపక్షాల ఆందోళన చేయడంతో స్పీకర్ ఓం బిర్లా ఒక నిమిషం లోపు సభను వాయిదా వేశారు.
బిర్లా తన సీటును స్వీకరించిన క్షణంలో నల్ల బట్టలు ధరించి సభకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ఆయన కుర్చీపై కాగితాలు విసిరారు. సభ్యుల తీరుపై స్పీకర్ ఓంబిర్ల అసహనం వ్యక్తం చేశారు. సభను గౌరవప్రదంగా నడపాలనుకుంటున్నాను అని స్పీకర్ పేర్కొంటూ సభా కార్యక్రమాలను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు, కొందరు ప్రతిపక్ష సభ్యులు నల్ల బట్టలు ధరించి లోక్సభకు వచ్చారు. ఇక, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.