Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టీంఇండియా స్టార్ ఆటగాడు, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ధావన్ పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 15 ఏండ్ల వయస్సులోనే హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నట్లు తెలిపి ఆశ్చర్యానికి గురి చేశాడు.
నేను 14-15 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు, నేను మనాలి టూర్‌కు వెళ్లా. అప్పుడు నా కుటుంబానికి తెలియకుండా నా వీపుపై ఓ టాటూ వేయించుకున్నాను. తర్వాత అది ఎవరికీ కనిపించకుండా దాదాపు 3 నుంచి 4 నెలల పాటు దాచాల్సి వచ్చింది. ఒక రోజు మా నాన్నకి ఆ పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. అప్పుడు ఆయన నన్ను తీవ్రంగా కొట్టారు. పచ్చబొట్టు వేయించుకున్నాక నేనూ కొంచెం భయపడి.. ఆస్పత్రికి వెళ్లి హెచ్ఐవీ టెస్టు చేయించుకున్నాను. ఆ టెస్టులో ఫలితం నెగెటివ్ అని వచ్చింది అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.