Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు పరచాలని సీపీఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైయివేటుపరం చేస్తూ.. మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీకి రాజకీయ మరణ దండనను విధించారని పేర్కొన్నారు. ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది.. రేపు మరొకరికి జరగవచ్చని, ఉరిశిక్ష పడ్డ వారికి కూడా చివరి కోరికను అడుగుతారని.. కానీ ఆయనను చివరి కోరిక కూడా అడగలేదని మండిపడ్డారు నారాయణ. కేంద్ర క్యాబినెట్ లోని 24 మంది మంత్రులపై కేసులు ఉన్నాయని, చుట్టూ దొంగలను పెట్టుకొని మోడీ పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.