Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ... హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. జంగా రాఘవరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు లేఖను అధిష్టానానికి పంపుతున్నట్టు వెల్లడించారు. రాఘవరెడ్డి సస్పెన్షన్ ను పార్టీ ఆమోదించకపోతే కీలక నిర్ణయం తీసుకుంటానని నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. అధిష్టానానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని నాయిని పేర్కొన్నారు.