Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణాది హిట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిలో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వ ఉద్యోగి అని టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని టాక్. అయితే తాజాగా నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ మూవీకి 'గేమ్ చేంజర్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. కాసేపటి క్రితమే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.