Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చెర్పీ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటికే టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే రామ్ చరణ్ బైక్‌పై కళ్లద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్న లుక్ అదిరిపోయింది. తాజా పోస్టర్‌ను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే టైటిల్ రివీల్ చేయడంతో చెర్రీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇవాళ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చారు డైరెక్టర్ శంకర్.