Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళంలో చారిత్రక నేపథ్యంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలలో 'పొన్నియిన్ సెల్వన్' ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించడమే కాదు .. లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించారు. చోళ - పాండ్యరాజుల మధ్య సాగే ప్రతీకార వ్యూహాలే ఈ సినిమా.
క్రితం ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, తన భారీతనాన్ని చాటుకుంది. వసూళ్ల విషయంలో తమిళనాట కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్ 2' ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ .. ట్రైలర్ లాంచ్ ఈవెంటును ఈ నెల 29వ తేదీన చెన్నైలో నిర్వహించనున్నారు. అక్కడి నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేదికగా మారనుంది. గ్రాండ్ గా జరగనున్న ఈవెంటుకి కమల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.