Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రియాద్ : సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు యాసిర్ ప్రావిన్స్ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.