Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్లోకి కొత్త శ్రేణి డెయిరీ ఉత్పత్తులను విడుదల చేసింది. ‘ఏ-వన్’ బ్రాండ్‌తో కొత్త శ్రేణి బటర్ మిల్క్‌ను విడుదల చేసినట్లు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. తీసుకువెళ్లడానికి వీలైన సింగిల్ సర్వ్ బాక్సుల్లో కొత్త శ్రేణి మిల్క్ షేక్స్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ‘ఏ-వన్’ స్పెషల్ బటర్ మిల్క్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. కొత్త శ్రేణి బటర్ మిల్క్ 180 ఎంఎల్ ప్యాక్‌లో లభ్యమవుతుంది. దీని ధర రూ.20. కొత్త శ్రేణి ఉత్పత్తులు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఎన్సీఆర్ ప్రాంతాల్లో లభ్యమవుతాయని హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి తెలిపారు. విలువ చేర్చిన ఉత్పత్తులపై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఈ వేసవి కాలంలో మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు చెప్పారు.