Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని రాష్ట్ర పంటగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. తిరుమల కొండపై గంజాయి పట్టుబడడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఊసరవెల్లి శ్రీదేవి అని మంత్రి అమర్నాథ్ సంబోధించడం దారుణమన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఎంత డబ్బు ఇచ్చి వైసీపీలోకి తెచ్చుకున్నారో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో? వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుని మాట్లాడితే మంచిదని మంత్రి రోజాకు అనిత హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తే సస్పెండ్ చేశారన్న అనిత.. తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్న విషయం తెలిస్తే జగన్‌కు పక్షవాతం వస్తుందేమోనని అన్నారు.