Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ పోల్స్ లో పాల్గొనాలనుకునే వాళ్లు బ్లూటిక్ ఉన్న వెరిఫైడ్ అకౌంట్లను కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 15 నుంచి ట్విట్టర్ పోల్స్ లో పాల్గొనే అవకాశం ఉండదని చెప్పారు. ఏప్రిల్ 15 నుంచి వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే ఫర్ యూ రెకమెండేషన్ లో ఉండటానికి అర్హతను పొందుతాయని తెలిపారు. 2022 అక్టోబర్ లో ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ అనేక నిర్ణయాలను తీసుకున్నారు. కంపెనీలో పెద్ద స్థాయిలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ కోసం డబ్బు వసూళ్లు, గోల్డ్ టిక్ వంటి నిర్ణయాలను ఆయన తీసుకున్నారు.