Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు తెరదింపేస్తూ ఆయన 30వ సినిమా షూటింగు మొదలైంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయమవుతుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అందుకు తగినట్టుగానే వీఎఫ్ ఎక్స్ కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్ 'బ్రాడ్ మిన్నిచ్' ను రంగంలోకి దింపారు. పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయన సొంతం. వీఎఫ్ ఎక్స్ గురించి కొరటాల ఆయన మాట్లాడుకుంటున్న ఫొటోను వదిలారు. ఈ సినిమా హైలైట్స్ లో వీఎఫ్ ఎక్స్ కూడా ఒకటిగా నిలవడం ఖాయమనే విషయం మాత్రం అర్థమవుతోంది.