Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీరుతల్లో ఒకటి సోమవారం మృతి చెందింది. సెప్టెంబర్‌లో నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్ లోకి వదిలారు. నిమిదింట్లో.. 5 ఆడ, 3 మగ చిరుతలు ఉన్నాయి.
ఎనిమిదింట్లో ఆడ చీత సాషా సోమవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కూనో పార్కులో ఉంటున్న సాషా రోజూవారి పరీక్షల్లో చాలా బలహీనంగా కనిపించేదని అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. చీతాకు డీహైడ్రేషన్ అవుతోందని అదేవిధంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సాషాను భారత్‌కు తీసుకురాక ముందే అనారోగ్యంతో బాధపడుతోందని అధికారులు వెల్లడించారు. పార్క్‌లోని ఇతర చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.