Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ నేతలు హాజరయ్యారు. దాదాపు 20 అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టం- కష్టాల్లో రైతాంగం; రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు; సభ్యత్వ నమోదు; పార్టీ సంస్థాగత బలోపేతం, సాధికార సారథులు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ నిర్వహణకు ఏర్పాటు చేసిన 11 కమిటీల వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటించారు.