Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -న్యూఢిల్లీ : క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 49 శాతం వాటాను సుమారు రూ.48 కోట్లతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ కొనుగోలు చేసింది. ఈ వివరాలను అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది. ఈ లావాదేవీ గురించి గత ఏడాది మే నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.47.84 కోట్ల విలువైన ఈ లావాదేవీ మార్చి 27న పూర్తయిందని అదానీ ఎంటర్‌ప్రైజస్ తెలిపింది. బ్లూమ్‌బర్గ్ క్వింట్ అనే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను క్వింటిలియన్ బిజినెస్ మీడియా నడుపుతోంది. ప్రస్తుతం దీనిని బీక్యూ ప్రైమ్ అని పిలుస్తున్నారు. అదానీ గ్రూప్ ప్రచురణలు, ప్రకటనలు, సమాచార ప్రసారాలు, వివిధ మీడియా నెట్‌వర్క్‌లకు కంటెంట్ పంపిణీ వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ను ఏర్పాటు చేసింది. క్వింటిలియన్ మీడియా లిమిటెడ్, క్యూబీఎంఎల్లతో గత ఏడాది మే నెలలో షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. అదానీ మీడియా వెంచర్స్‌ను నడిపేందుకు వెటరన్ జర్నలిస్ట్ సంజయ్‌ని 2021 సెప్టెంబరులో నియమించుకుంది.