Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాద్రి కొత్తగూడెం
శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్యస్పందన వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్లు అవుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే కల్యాణ అనంతరం తలంబ్రాలను భక్తులకు హోండెలివరీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్ జరుగుతోంది. ఈ తరుణంలో భక్తులకు మరో అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది.