Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
పులివెందుల నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మార్చి 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం పులివెందులలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో భరత్ కుమార్ అనే యువకుడు మరో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్, మహబూబ్ భాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల శబ్దంతో స్థానికులు పరిగెత్తుకుని రావటంతో నిందితుడు భరత్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు.
వివరాల్లోకి వెళ్తె కాల్పులు జరిపిన భరత్ కుమార్ కు గాయపడిన దిలీప్ మధ్య కొన్నాళ్లుగా డబ్బుల వివాదం నడుస్తుందని ఈ తరుణంలోనే గొడవ జరిగిందని దీంతో మాటా మాటా పెరిగి కాల్పుల వరకు వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు. ఇంట్లోని తుపాకీ తీసుకొచ్చి మరీ కాల్చాడని భరత్ దగ్గర ఉన్న గన్ కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయంపైనా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు .
గాయపడిన దిలీప్ పరిస్థితి విషమంగా లుఉండటంతో అతన్ని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.