Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపుగా 60 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. శబరిమలలో అయ్యప్ప దర్శనం ముగించుకుని తిరిగివస్తుండగా బస్సు అదుపు తప్పి పాతనంతిట్ట జిల్లాలోని లోతైన గొయ్యిలో పడిపోయింది. ఈ తరుణంలో గాయపడిన వారిని వెంటనే పతనంతిట్ట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా తమిళనాడులోని తాంజావూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.