Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసు విచారణ త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరగా జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి కోరగా స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంత మంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరణించిన వారి తరఫున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతివ్వాలని న్యాయవాదులు కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ఆదేశించింది.