Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మెక్సికో
అమెరికా సరిహద్దు లో మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సిడెడ్ జారే నగరంలోని శరణార్థి శిబిరంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనం తెలిపారు.
ఈ మెక్సిన్ నగరంలోని నేషనల్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అగ్నిప్రమాదాన్ని ధ్రువీకరించారు. 39 మంది చనిపోయినట్టు వెల్లడించారు. ఈ ఐఎన్ఎం శిబిరంలోని పార్కింగ్ స్థలంలో పదుల సంఖ్యలో మృతదేహాలను దుప్పట్లలో కప్పి ఉంచినట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది. 29 మందికి గాయాలైనట్లు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఈ శిబిరంలో 70 మంది శరణార్థులు ఉన్నట్లు, వారిలో అధికులు వెనిజువెలాకు చెందిన వారని తెలుస్తోంది.