Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పరువు నష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్కే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్ లకు ఢిల్లీ హైకోర్టు ఈ రోజు సమన్లు జారీ చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీ రాహుల్ రమేష్ షెవాలే దాకలు చేసిన పిటిషన్ పై కోర్టు సమన్లు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, అతడి వర్గం శివసేన గుర్తు అయిన ‘ విల్లు-బాణం’ను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేశారని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఠాక్రే వర్గం నేతలను అడ్డుకోవాలని షెవాలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది రాజకీయ సమస్య కాబట్టి ఎదుటి పక్షం వాదనలను వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తెలిపింది.
విచారణ సమయంలో రాహుల్ రమేష్ షెవాలే తరపు న్యాయవాది మాట్లాడుతూ సంజయ్ రౌత్ తదితరులు భారత ఎన్నికల సంఘం వంటి సంస్థపై ఆరోపణ చేశారని అన్నారు. ఇలాంటి ఆరోపణలపై స్పందించే అవకాశం ఈసీఐకి ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం శివసేన గుర్తు విల్లు-బాణంని ఏక్ నాథ్ షిండే వర్గానికి అప్పగించింది.