Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లో మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరితే ప్రయాణికుల రద్దీలేదు, సాధ్యం కాదంటూ కేంద్రం తప్పుడు నివేదికలు ఇస్తోందని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్లో 50 చెరువుల పునరుజ్జీవనం, సుందరీకరణకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.
ఈ తరుణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు 31 కి.మీ మేర మెట్రో విస్తరణకు సహకరించాలని కోరితే ఆ ప్రాంతాల్లో అంత సాధ్యం కాదని కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని అన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్లో 10 నగరాల్లో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. ప్రతి నగరంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. నిధులు ఇచ్చే ఉద్దేశం లేకపోతే లేదని చెబితే సరిపోతుంది. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదా? దేశ సంపదలో హైదరాబాద్ సంపద ఉపయోగపడట్లేదా? తెలంగాణ నుంచి మనం పన్నులు కట్టడం లేదా? హైదరాబాద్ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది’’ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.