Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఉద్యాన (హార్టికల్చర్) శాఖలో పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ పరీక్షను తిరిగి జూన్ 17న నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా పరిణామాల మధ్య ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించాలా లేదంటే కొంత వ్యవధితో రీషెడ్యూలు చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరిపిన అధికారులు తాజాగా ఆ పరీక్షను వాయిదా వేశారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉద్యాన అధికారుల పోస్టులకు ఏప్రిల్ 4న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి త్వరలోనే కొత్త తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది.