Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఎన్టీఆర్ శతజయంతి తరుణంలో ఎన్టీఆర్ పేరుతో ప్రత్యేక నాణెం విడుదల చేసే అంశంపై ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో మీకు ధన్యవాదాలు తెలిపింది. నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశం మీ నిర్ణయాన్ని స్వాగతించింది.
నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఎన్టీఆర్‌ని సన్మానించడమంటే తెలుగు వారిని గౌరవించడమే అని తన లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరుపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని లేఖలో వివరించారు.