Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే అవినాశ్ ను సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.