Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజన్న సిరిసిల్ల
ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సర్వసాధారణం. ఎప్పుడో ఓసారి అరుదుగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు కూడా జన్మిస్తారు. అయితే ముస్తాబాద్‌లో మాత్రం ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ పీపుల్స్ ఆస్పత్రిలో చేరింది. ఇది ఆమెకు రెండో కాన్పులో మొదటి కాన్పులో ఆమెకు ఓ బాబు. ప్రస్తుతం పుట్టిన వారిలో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఒకరు అమ్మాయి ఉన్నారు. ఈ క్రమంలో తల్లితో పాటు పుట్టిన నలుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువులు 1 కిలోగ్రాము చొప్పున బరువు ఉన్నారని వెల్లడించారు. వీరిని ఇంక్యుబేటర్‌లో పరిశీలన నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.