Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమంగా పుంజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే ముందస్తు ప్రచారం సాగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాండ్యలో మంగళవారం జరిగిన ర్యాలీలో కరెన్సీ నోట్లు జనం వైపు విసురుతూ కెమెరాకు చిక్కారు. బెవినహళ్లి సమీపంలో ఆయన రథయాత్ర సాగిస్తూ, తన వాహనం పైనుంచే కరెన్సీ నోట్లు విసరడం కనిపించింది. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో వొక్కలిగ సామాజిక వర్గం ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు పట్టుదలగా ఉన్నారు. కాగా, మాండ్య నియోజకవర్గం జేడీఎస్ కంచుకోటగా నిలుస్తోంది.