Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ మళ్లీ పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు. సహాయకుడు పాపల్ ప్రీత్ తో కలిసి ఫగ్వారా నుంచి హోషియార్పూర్ చెక్పోస్ట్ మీదుగా అమృతపాల్ తప్పించుకొని పారిపోయాడు.అమృతపాల్ సింగ్ పంజాబ్లోని హోషియార్పూర్లో ఉన్నట్లు సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులతో కలిసి పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు కారును గురుద్వారా సమీపంలో వదిలి పారిపోయారని పోలీసులు చెప్పారు. సెర్చ్ ఆపరేషన్లో పోలీసులు అమృతపాల్ ఇద్దరు సహాయకులను అదుపులోకి తీసుకున్నారు.కొన్ని గంటల క్రితం ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ మార్చి 21న తూర్పు ఢిల్లీలోని మధు విహార్లో నడుస్తున్నట్లు చూపుతున్న కొత్త సీసీటీవీ ఫుటేజ్ వెలువడింది. అతను తలపాగా లేకుండా కనిపించాడు.