Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాబూల్: అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ తెలిపింది. భూకంప కేంద్రం కాబూల్‌కు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భంగాలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, రెండు రోజుల క్రితం అంటే ఈ నెల 27న తఖర్ ప్రావిన్స్‌లోని ఫర్ఖర్ జిల్లాలో స్వలంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 4.53 గంటలకు 4.2 తీవ్రతతో భూమికంపించిందని ఎన్సీఎస్ తెలిపింది. ఇక ఈ నెల 22న (గత బుధవారం) హిందూకుష్ పర్వతశ్రేణుల్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 12 మంది మరణించారు. గత బుధవారం హిందూకుష్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో అఫ్గాన్‌తోపాటు పాకిస్థాన్‌లో 250 మందికిపైగా గాయపడ్డారు. ఇక ఉత్తర భారతంతోపాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.