Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జహీరాబాద్: ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదంలో.. తమ్ముడి కుమారుడు పెద్దనాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. ఝరాసంగం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగం మండలం బర్ధిపూర్ గ్రామానికి చెందిన చంద్రప్ప(55), రత్నం అన్నదమ్ములు. వీరికి గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. వీరి మధ్య కొన్నేండ్లుగా భూవివాదం నడుస్తున్నది.
చంద్రప్ప మంగళవారం మధ్యాహ్నం రోజుమాదిరిగా వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. బర్ధిపూర్ శివారులోని కుప్పానగర్-ఎల్గొయి రోడ్డు మధ్యలో మాటేసి ఉన్న రత్నం కుమారుడు రాకేశ్.. పెద్దనాన్న(చంద్రప్ప)ను పదునైన కత్తితో అతికిరాతకంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేశాడు. తలను ఝరాసంగం శివారులో రోడ్డు పక్కన, మొండెంను మరోచోట విసిరేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఝరాసంగం, హద్నూర్ ఎస్సైలు రాజేందర్‌రెడ్డి, వినయ్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. హత్యజరిగిన స్థలంలో మృతుడి మోటార్ సైకిల్, వాటర్ బాటిల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భూవివాదంతోనే రత్నం కుమారుడు చంద్రప్పను హత్య చేశాడని జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశ్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.