Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్ధిని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కు 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి కూతురు ఉంది. హేమలతా హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది.
ఈ తరుణంలో ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డికి వున్న చేతి ఉంగరం పోయింది. హేమలతా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉంగరం పోయిందని తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడింది. తిడతారేమో అని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసింది. అందులో అమ్మా, నాన్నా నన్ను క్షమించండి ఉంగరం పోగొట్టుకున్నాను. అది తెలిస్తే మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అనంతరం వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.