Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ హడావిడి మొదలయింది. ఈ క్రమంలో ముంబై అభిమానులకు సీజన్ మొదలవక ముందే మేనేజ్మెంట్ ఓ చేదు వార్తను ప్రకటించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగియడంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ఉన్న తరుణంలో తనపై అదనపు భారం, గాయాల బెడద తగ్గించుకోవడం కోసం రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ మ్యాచ్ లు ఆడనప్పుడు డగౌట్ లో కూర్చొని టీంను, సారథిని గైడ్ చేస్తాడని ముంబై మేనేజ్మెంట్ వివరించింది.