Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యాపిల్ యూజర్లకు టెక్ దిగ్గజం తీపికబురు అందించింది. యూజర్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం పొందే వెసులుబాటు ఉంది. ఈ సర్వీస్ ద్వారా ప్రోడక్ట్స్ కొనుగోలుపై యూజర్లు ఇన్స్టాల్మెంట్స్లో యూజర్లు చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పుడు కొని, తర్వాత చెల్లించడమనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా అమెరికన్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను యాపిల్ లాంఛ్ చేసింది. ఆరు వారాల్లో నాలుగు వాయిదాల రూపంలో ఈ రుణాలను యూజర్లు తిరిగి చెల్లించవచ్చు. యాపిల్ పే పేమెంట్ పద్ధతిని ఆమోదించిన వ్యాపారుల నుంచి యూజర్లు ఈ లోన్స్‌ను ఆన్లైన్, యాప్ కొనుగోళ్ల కోసం తమ ఐఫోన్, ఐప్యాడ్లపై పొందవచ్చు. ఇక ఈ చెల్లింపులను యూజర్ యాపిల్ వాలెట్ పర్యవేక్షిస్తుండటంతో యూజర్లు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వీలుంది. యాపిల్ పే ల్యాటర్ ప్రీ-రిలీజ్ వెర్షన్‌ను యాక్సెస్ చేసుకునేందుకు ఎంపిక చేసిన యూజర్లను యాపిల్ ఆహ్వానిస్తుందని కంపెనీ ప్రకటించింది. మరో రెండు నెలల్లో అర్హులైన యూజర్లందరికీ ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది.