Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన 84 మందిని విచారించారు. అయితే, తన కోసమే గ్రూప్-1 పేపర్‌ను ప్రవీణ్ తీసుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత తన ముగ్గురు సహోద్యోగులకు ఆ పేపర్‌ను ఇచ్చినట్లు భావిస్తున్నారు. గ్రూప్-1 పేపర్ ఐదుగురికే ప్రవీణ్, రాజశేఖర్, షమీమ్, రమేశ్, సురేశ్‌లకు చేరినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు.
మరోవైపు ఏఈ ప్రశ్నపత్రం 12 మందికి చేరినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఇప్పటికే ఏఈ పరీక్ష రాసిన నలుగురిని అరెస్టు చేసి కోర్టు అనుమతితో 3 రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. డాక్యానాయక్, రాజేందర్ కలిసి ఏఈ పేపర్ విక్రయించినట్లు గుర్తించారు.