Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జి పొసరిగళ్ల రాజు, బీజేపీ బూత్ ప్రెసిడెంట్లు పుల్లూరు ప్రవీణ్, జంగంపల్లి రాజిరెడ్డి, 8వ వార్డుకు చెందిన సీనియర్ నేత గడ్డం జ్యోతిరాజ్తో పాటు 70 మంది కార్యకర్తలు భారత రాష్ట్ర సమితిలో చేరారు. వీరంతా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలకు పార్టీ సమాన అవకాశాలను కల్పిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.