Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక రాజకీయ విప్లవం తెచ్చారని.. అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తలఎత్తుకునేలా చేశారు. ప్రజల భవితకు భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ నవజాతికి మార్గదర్శకం.. యువతకు ఆదర్శం. ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం' అని అన్నారు.