Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) నియామకాలని నిర్లక్ష్యం చేసిన ఉన్నత విద్యాశాఖ ప్రస్తుత ఈసీల కాలపరిమితిని రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆదికవి నన్నయ, ఆచార్య నాగార్జున, ఆంధ్రా, కృష్ణా, రాయలసీమ, బీఆర్ అంబేద్కర్, శ్రీకృష్ణదేవరాయ, విక్రమ సింహపురి, యోగి వేమన, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ, ద్రవిడియన్, శ్రీవెంకటేశ్వర, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీల ఈసీలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22తో ఈ 14 యూనివర్సిటీల ఈసీల కాలపరిమితి ముగిసింది.