Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భూపాలపల్లి
మద్యం మత్తు విచక్షణను చిత్తు చేసింది. మానవత్వాన్ని చంపేసింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను కడతేర్చేలా చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. భూపాలపల్లి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం వేశాలపల్లికి చెందిన ఎలగంటి రమణాచారికి భార్య, ఇద్దరు పిల్లలు. ఆయన మద్యానికి బానిసై భార్యతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమణాచారి ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య రమ (43)ను నరికాడు. అడ్డుకోవడానికి వెళ్లిన కుమార్తె చందన (17)నూ నరికి చంపాడు. ఇది చూసి కుమారుడు (9) కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి అతడిని కాపాడారు. చందన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. పోలీసులు రమణాచారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.