Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అమాంతం 40 శాతం పెరిగి.. 3,016కి చేరాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 1,10,522 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఈస్థాయి పెరుగుదల కనిపించింది. ముందురోజు ఈ కేసుల సంఖ్య 2,151గా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 13,509(0.03శాతం)కి చేరాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతానికి చేరడం కలవరానికి గురిచేస్తోంది. కేంద్రం కొత్తగా 14 మరణాలను ప్రకటించింది. అందులో కేరళ నుంచి ఎనిమిది మరణాలు వచ్చాయి. అవి సవరించిన గణాంకాలు. ఇక 2021 నుంచి 220.65 కోట్ల టీకా డోసులు పంపిణీ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.