Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
పాఠశాల విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన చెన్నైలోని పెరంబూర్లో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదురామకృష్ణాపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం సాయంత్రం ప్లన్ వన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై గొడవపడటం ప్రారంభించారు. వారిలో ఓ బాలిక తన సహచర విద్యార్థితో ప్రేమాయణం నడుపుతోందని సమాచారం. అయితే.. తన ప్రియుడికి మరో బాలిక వాట్సాప్ మెసేజ్ పంపడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ నడిరోడ్డుమీదే గొడవపడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలికల స్నేహితులు కూడా వారికి జతకూడారు. దీంతో.. వారందరూ రెండు గ్రూపులుగా విడిపోయి జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. కాగా.. ఈ వ్యవహారం మొత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో వారు స్టూడెంట్స్ను విచారిస్తున్నారు.