Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పేపర్ లీకేజ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిరనలు, దీక్షల వరకు దారితీస్తున్నాయి. పేపర్ లీకేజ్ కి కారణం నువ్వుంటే నువ్వు అని ఒకరిపై మరొకరు దుమారం రేపుతున్నారు. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కేసులో నిందులను అదుపులో తీసుకున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కొందరికి నోటీసులు కూడా జారీ చేసింది.
ఇప్పటి వరకు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ ఇవాళ షమీమ్, సురేష్, రమేష్ లను రెండో రోజు విచారించున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన షమీమ్ తన వద్ద నుంచి ప్రశ్నాపత్రాన్ని ఇంకా ఎవరికైనా షేర్ చేశారా అనే దానిపై సిట్ ఆరా తీస్తుంది. వీరి ముగ్గురి సెల్ ఫోన్ డేటా ను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ , రాజశేఖర్ ల నుండి షమీమ్ ప్రశ్నాపత్రం పొందింది. అయితే ఇవాల సిట్ బృందం ముగ్గురు నిందితుల ఇళ్ళల్లో సోదాలు చేయనున్నారు.