Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తణుకు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తారాజువ్వ పడటంతో వేణుగోపాలస్వామి ఆలయ పందిరి దగ్ధమైంది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆలయంలో జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్రమంగా భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.