Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో రాజేంద్రనగర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపింది. ఇంట్లో తల్లి ఉండగానే డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి హుమర్ బెగమ్ అనే కూతురు కూడా ఉంది. గోల్కొండ మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న హుమర్ బెగమ్. రోజూ లాగానే తండ్రి ఉద్యోగానికి వెల్లడం, ఇంట్లో తల్లి, కూతురు ఉంటారు. అయితే హాల్ లో ఇద్దరూ కూర్చున్నారు. పని నిమిత్తం లోనికి వెల్లిన బయటకు వచ్చిన తల్లికి ఇంట్లో హుమర్ బేగమ్ కనిపించలేదు.
తన రూములో వుంటుందని భావించి కాసేపు హాల్ లోనే కూర్చుంది తల్లి. ఎంతసేపటి కూతురు బయటకు రాకపోవడంతో రూం లోకి వెల్లి చూసింది. రూంలో కూడా కూతురు కనిపించలేదు. దీంతో కూతురు కనిపించకుండా పోవడంతో భయాందోళన చెందిన తల్లి భర్తకు ఫొన్ చేసి సమాచారం ఇచ్చింది. విద్యార్థిని చదువుతున్న కళాశాలకు, స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేశారు అయినా ఎక్కడా తన ఆచూకీ తెలియక పోవడంతో హుటాహుటిన అత్తాపూర్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ ఫోన్ కాల్ లిస్టు ను పరిశీలిస్తున్నారు.