Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక వ్యక్తి భార్య తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన భర్త, తుపాకీతో కాల్పులు జరిపి మామను హత్య చేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పైఠాన్‌లోని అడోల్కు చెందిన ఒక వ్యక్తి భార్య తన ప్రియుడితో కలిసి ఔరంగాబాద్‌కు పారిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆమె భర్త బుధవారం అంబాద్‌లోని శారదా నగర్లో నివసిస్తున్న మామ ఇంటికి వచ్చాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. కాగా, ఆ వ్యక్తి ఆగ్రహంతో తుపాకీతో మామపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు మరణించాడు. అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.