Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కుటుంబంలో కొద్ది రోజులుగా కలహాలు సర్ది చెప్పిన ఇరువురు
- దిక్కుతోచని స్థితిలో కుమారులు
నవతెలంగాణ-వెల్గటూర్
మద్యం మత్తులో భార్యని అతి దారుణంగా నరికి చంపేశాడు. మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతూ అమాయకపురాలైన తన కూతురును కడతేర్చాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు కుమారులు నాలుగేళ్ళ బాబు ఒకరు, సంవత్సరంన్నర బాబు అనాథయ్యాలయ్యారు. ఎస్సి కాలనిలో కలకాలం సృష్టించిన ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తునూరు గ్రామానికి చెందిన రాజేశ్వరి స్తంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్ తో 6ఏళ్ల క్రితం వివాహం అయింది. కూలీ పని చేసుకుంటూ ఊళ్లోనే జీవనం సాగిస్తున్నారు. కాగా గత కొంత కాలంగా తాగుడుకు బానిసగా మరి కుటుంబంలో ఎప్పుడు కలహాలు ఉండటంతో, రెండు రోజుల కిందటే రాజేశ్వరి, అన్న కండ్లే సమ్యూల్ ఇరువురితో మాట్లాడగా ఇద్దరం కలిసి ఉంటామని చెప్పగా నమ్మి వచ్చినట్లు తెలిపారు. 29న రాత్రి మద్యం సేవించి పక్క ప్రణాళికతోనే తాటి చెట్లు గిసే పదునైన కత్తితోనే రాజేశ్వరి పిల్లలతో సహా నిద్రిస్తున్న సమయంలోనే ఆమె పైన దాడి చేయగా మెలుకువ వచ్చి అడ్డుకునే ప్రయత్నంలో చూపుడు వ్రేలిని కట్ చేసి క్రింది దవడ, పైన చిత్ర హింసలకు గురిచేసి గొంతు కోసి హతమార్చి ఉంటడాని తల్లిదండ్రులు,సోదరుడు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్వాపరాలను పరిశీలించారు.రాజేశ్వరి మృతితో మండలంలోని ఇరు గ్రామాల్లో విషాదచాయాలు అలుముకున్నాయి . మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ బిళ్ళ కోటేశ్వర్, ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.